క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో గతంలో ప్రేమాయణం నడిపిన యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్ ప్రస్తుతం టీవీ నటితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. భారత క్రికెటర్ శుభ్‌మన్ గిల్- టీవీ నటి అవనీత్ కౌర్‌లు ప్రేమలో వున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. వారిద్దరూ దాని గురించి మాట్లాడనప్పటికీ, అవనీత్ ఇటీవల దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం నుండి టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.