ఇకపోతే...సారా యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుండి క్లినికల్- పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉంది. యూకేకు చెందిన అసోసియేషన్ ఫర్ న్యూట్రిషన్‌లో నమోదు చేసుకుంది. ప్రస్తుతం ఫంక్షనల్ న్యూట్రిషన్ కోచ్‌గా మారడానికి కృషి చేస్తోంది. ఈ రంగంలో ఆమెకున్న నైపుణ్యం వెల్‌నెస్ పట్ల ఆమెకున్న నిబద్ధతను నొక్కి చెబుతుంది.
సారా ఇటీవలే తన తండ్రికి చెందిన సంస్థలో డైరెక్టర్‌గా చేరింది. క్రీడలు, విద్య, ఆరోగ్య సంరక్షణ ద్వారా సమాజాలను శక్తివంతం చేయడంపై దృష్టి సారించింది. ఆరోగ్యకరమైన జీవనశైలికి మద్దతుదారుగా, సారా తరచుగా ముంబైలోని జిమ్‌లలో కనిపిస్తుంది. సెలవుల్లో కూడా ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తుంది.