వంద వికెట్ల క్లబ్‌లో జస్ప్రీత్ బుమ్రా

మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (09:25 IST)
భారత క్రికెట్ జట్టుకు చెందిన యువ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అతి తక్కువ కాలంలో వంద వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ టెస్టులో కింగ్‌స్టన్ ఓవెల్ మైదానంలో 50 యేళ్ళ తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. 
 
ఇంగ్లండ్‌తో ఓవెల్ మైదానంలో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌ ఐదో రోజున బుమ్రా ఈ రికార్డును సాధించాడు. తద్వారా హర్యానా హరికేన్ కపిల్ దేవ్ పేరిత ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. కపిల్ దేవ్ 25 టెస్టుల్లో 100 వికెట్లు తీయగా, బుమ్రా 24 టెస్టుల్లోనే ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు