కాగా.. దేశానికి ప్రపంచకప్ అందించిన తొలి కెప్టెన్‌గా కపిల్‌దేవ్ చరిత్ర సృష్టించాడు. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన జట్టును 1983లో విశ్వవిజేతగా నిలపడంలో ఈ ‘హరియాణా హరికేన్‘ది కీలక పాత్ర. 61 ఏళ్ల కపిల్‌దేవ్ భారత్ తరఫున 131 టెస్టులు, 225 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 5248 పరుగులతో పాటు 434 వికెట్లు తీశాడు. వన్డేల్లో 3783 పరుగులు, 253 వికెట్లు సాధించాడు.
ఇకపోతే.. కపిల్ దేవ్ త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెటర్లు, మాజీలు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చేస్తున్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ శిఖర్ ధావన్, మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, మాజీ క్రికెటర్ మదన్‌లాల్ ట్వీట్‌లు చేశారు.