పాకిస్థాన్ క్రికెట్ డ్రెస్సులతో.. కాశ్మీర్ క్లబ్ క్రికెటర్ల పాక్ జాతీయ గీతాలాపన?

బుధవారం, 5 ఏప్రియల్ 2017 (15:39 IST)
దేశ సరిహద్దుల్లో కాశ్మీర్ క్లబ్ క్రికెటర్లు.. పాకిస్థాన్ క్రికెట్ డ్రెస్సులు ధరించి ఆ దేశ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా.. జమ్ముకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ ఇప్పటివరకూ స్పందించలేదు. దాంతో సర్వత్రా విమర్శలు వెల్లువత్తుతున్నాయి. 
 
సదరు వీడియోలో కాశ్మీర్ లోయకు చెందిన క్రికెటర్లు పాకిస్థాన్ జాతీయ గీతాన్ని పాడటం సబబు కాదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సెంట్రల్ కాశ్మీర్ గందర్బాల్ జిల్లాలో ఈ మ్యాచ్‌ను నిర్వహించారు. ఈ మ్యాచ్ జరిగిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా జమ్మూ-కాశ్మీర్‌లో చెనాని-నష్రీ టన్నల్‌ను ప్రారంభించారు. కాగా ఈ వీడియోలో పాకిస్థాన్ దుస్తుల్లో కనిపించి.. పాకిస్థాన్ జాతీయ గీతాన్ని పాడటంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి