కటక్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఈ ఆఖరి మ్యాచ్ కోసం తుది జట్టులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, కేదార్ జాధవ్, రవీంద్ర జడేజా, షమీ, ఠాకూర్, కె.యాదవ్, ఎన్ షైనీ ఉన్నారు.
అయితే, బ్యాటింగ్‌కు అనుకూలించే ఇక్కడి పిచ్ పై ప్రమాదకర విండీస్ ఓపెనర్లను ఓ మోస్తరు స్కోర్లకు అవుట్ చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. విండీస్‌కు ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (21), షాయ్ హోప్ (42) శుభారంభాన్నందించారు. తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించారు. అలాగే, ఛేజ్ 38, హత్మియర్ 37, పూరన్ (89), పొల్లార్డ్ (74), హోల్డర్ (7)లు చొప్పున పరుగులు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఫలితంగా భారత్ ముందు 316 భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది.
ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ రవీంద్ర జడేజా టీమిండియాకు బ్రేకిచ్చాడు. లూయిస్‌ను అవుట్ చేసి భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఆ తర్వాత కాసేపటికే హోప్‌ను షమీ అవుట్ చేయడంతో విండీస్ రెండో వికెట్ కోల్పోయింది. అయితే, కెరీర్‌లో తొలి వన్డే ఆడుతున్న యువ ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ కటక్‌లో నిప్పులు చెరిగాడు.