ఫైనల్లోకి సన్‌రైజర్స్.. సంబరాలు చేసుకున్న కావ్యమారన్

సెల్వి

శనివారం, 25 మే 2024 (08:53 IST)
Kavya Maran
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్‌ ఫైనల్ చేరింది. కాగా శుక్రవారం రాత్రి చెన్నై వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 36 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది.

మ్యాచ్‌ గెలిచిన వెంటనే సన్‌రైజర్స్ శిబిరంలోని సభ్యులతో కరచాలనం చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారిపోయాయి. 
 
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు, ఫ్యాన్స్ కూడా సంబరాల్లో మునిగిపోయారు. ఆరేళ్ల తర్వాత తమ జట్టు ఫైనల్ చేరడంతో హర్షం వ్యక్తం చేశారు. ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్‌ ఫైనల్ చేరడంతో ఆ జట్టు యజమాని కావ్య మారన్ తెగ సంబరపడ్డారు. ఆనందంలో ఎగరి గంతేశారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు