WTC final : మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ

శనివారం, 19 జూన్ 2021 (16:07 IST)
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్‌ చేశాడు. అత్యధిక టెస్టులకు కెప్టెన్‌గా బాధ్యత వహించిన సారథిగా అరుదైన రికార్డు సృష్టించాడు. మహేంద్ర సింగ్‌ ధోనీ 60 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించిన తర్వాత టెస్టు రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీకి ప్రస్తుతం జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌ 61వది. ధోనీ కంటే ముందు మాజీ క్రికెటర్లు, కెప్టెన్లు సౌరవ్‌ గంగూలీ 49 టెస్టులకు, మహ్మద్‌ అజారుద్దీన్‌ 47 టెస్టులకు, సునీల్‌ గవాస్కర్‌ 47 టెస్టులకు కెప్టెన్సీ వహించి టాప్‌ 5లో ఉన్నారు. టీమిండియా తరుపునే కాకుండా ఆసియాలోనే అత్యధిక టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించిన సారథిగా విరాట్‌ కోహ్లీ మరో రికార్డు నెలకొల్పాడు. 
 
టీమిండియా, పాక్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఆఫ్ఘాన్‌, నేపాల్‌ వంటి దేశాల్లో ఎక్కువ టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించిన రికార్డు ధోనీ పేరిటే ఉండేది. శ్రీలంక మాజీ కెప్టెన్‌ అర్జున రణతుంగ, పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ మిస్బావుల్‌ హక్‌ 56 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించారు. దీంతో ఆసియాలోనే ఎక్కువ టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించిన సారథిగా కోహ్లీ రికార్డు క్రియేట్‌ చేశాడు.
 
61 టెస్టుల్లో 36 విజయాలు అందుకున్న విరాట్‌ కోహ్లీ.. 14 మ్యాచుల్లో పరాజయాలు చవిచూశాయి. 10 మ్యాచులు డ్రాగా ముగిశాయి. 59.01 విజయాల శాతంతో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ టీమిండియా టెస్టు కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. మహేంద్ర సింగ్‌ ధోనీ 60 టెస్టుల్లో 27 విజయాలు అందుకోగా.. సౌరవ్‌ గంగూలీ 49 మ్యాచుల్లో 21 విజయాలు, అజారుద్దీన్‌ 47 టెస్టుల్లో 14 విజయాలు అందుకున్నారు. 
 
అంతేకాదు, 2014లో ధోనీ టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన సమయంలో భారత జట్టు టెస్టు ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉంది. విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా వరుసగా ఐదేళ్లు టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచి ఐదుసార్లు టెస్టు ఛాంపియన్‌షిప్‌ కప్‌ను అందుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు