భారత మాజీ టెస్ట్ కెప్టెన్, చీఫ్ సెలక్టర్ అజిత్ వాడేకర్ (77) తుదిశ్వాస విడిచారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దక్షిణ ముంబైలోని జస్లోక్ దవాఖానాలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
భారత జట్టు తరఫున ఆయన 37 టెస్ట్ మ్యాచ్‌లు, 2 వన్డే మ్యాచ్‌లు ఆడారు. 1941లో ముంబైలో జన్మించిన వాడేకర్.. భారత అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరు. 1974లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత జట్టుకు వాడేకర్ సారథ్యం వహించారు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత 1990లలో జట్టు కోచ్‌గా, మేనేజర్‌గా సేవలందించారు. వాడేకర్ మృతి పట్ల క్రికెట్ సెలెబ్రిటీలు, ఫ్యాన్స్ దిగ్భ్రాంతి చెందారు. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారీ, సురేష్ ప్రభుతో పాటు పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖలు ప్రగాఢ సంతాపం తెలిపారు.
1990ల్లో అజహరుద్దీన్ కెప్టెన్సీలోని భారత జట్టుకు మేనేజర్ కమ్ కోచ్‌గా వ్యవహరించారు. సీకే నాయుడు జీవిత సాఫల్యపురస్కారం కూడా అజిత్‌వాడేకర్ అందుకున్నారు. 1998-99 మధ్యకాలంలో సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. లాలా అమర్‌నాథ్, చందూ బోర్డె తర్వాత ఆటగాడిగా, సారథిగా, కోచ్‌గా, సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా చేసిన మూడో వ్యక్తిగా రికార్డుల కెక్కారు.