ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలి వికెట్ పడింది. 128 పరుగుల వద్ద అజహర్ అలీ రనౌట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో వేసిన బంతిని ఎదుర్కోబోయిన అజహర్ అలీ రన్ అవుటయ్యాడు. మొత్తం 71 బంతుల్లో 59 పరుగులు చేసిన అలీ, నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 25.6 ఓవర్లలో 150 పరుగులు సాధించింది.
అయితే అలీ అవుట్ కావడంతో నిలకడగా రాణించిన ఫకర్ 92 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సరతో సెంచరీ సాధించాడు. అతనికి బాబర్ అజామ్ (8) చక్కని భాగస్వామ్యం అందిస్తున్నాడు. ఫలితంగా 31 ఓవర్లలో పాకిస్థాన్ ఒక వికెట్ నష్టానికి 186 పరుగులు సాధించింది. ప్రస్తుతం ఫకర్ (103), అజమ్ (8) క్రీజులో ఉన్నారు.