6 బంతులు.. 6 వికెట్లు.. అన్నీ క్లీన్ బౌల్డ్.. అత్యంత అరుదైన రికార్డు

శనివారం, 12 ఆగస్టు 2017 (09:53 IST)
ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. ఆరు బంతుల్లో ఆరు వికెట్లు. అన్నీ క్లీన్ బౌల్డ్. ఇలాంటి అరుదైన రికార్డు‌ను ఓ స్కూల్ బాయ్ అండర్ - 13 క్రికెట్ టోర్నీలో నెలకొల్పాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బ్రిటన్‌లోని ఫిలడెల్ఫియా క్రికెట్ క్లబ్ యువ క్రికెటర్ ల్యూల రాబిన్‌సన్ అండర్ - 13 క్రికెట్ టోర్నీలో బౌలింగ్ చేసి డబుల్ హ్యాట్రిక్ సాధించి ఔరా అనిపించాడు. అతను సాధించిన ఘనతపై బ్రిటన్ పత్రికలు ప్రముఖంగా కథనాలు ఇచ్చాయి. 
 
అయితే, ఈ ఫీట్ సాధిస్తున్న వేళ, రాబిన్ సన్ తల్లి హెలెన్ స్కోరర్‌గా వెల్లడిస్తుండగా, తండ్రి స్టీఫెన్ అంపైరింగ్ చేస్తుండటం గమనార్హం. ఇక అతని తాత గ్లెన్ మ్యాచ్‌ని స్వయంగా వీక్షించి మనవడి అద్భుత రికార్డును ఆస్వాదించాడట. 

వెబ్దునియా పై చదవండి