ఇకపోతే, పెళ్లయిన తర్వాత హసీన్ కోసం ఇప్పటిదాకా రూ.1.5 కోట్లు తాను ఖర్చు చేశానని చెప్పుకొచ్చాడు. తనో అబద్ధాల కోరు. ఆమె నా డెబిట్ కార్డుతో షాపింగ్ చేసేది. ఇటీవల దుబాయ్‌లో తాను ఏం చేశానో హసీన్‌కు అంతా తెలుసని.. ఆ సమయంలో కూడా తనకు వజ్రం, బంగారం తీసుకురావాలని తనను కోరిందని షమీ చెప్పాడు.
అదేసమయంలో తనపై హసీన్ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపైనా షమీ స్పందించాడు. తాను ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్లు విచారణలో తేలితే ఉరికి సిద్ధమని ప్రకటించాడు. తనపై వచ్చిన ఆరోపణల గురించి స్పందించే క్రమంలో షమీ కన్నీటి పర్యంతమయ్యాడు. 'నేనెప్పుడూ నిజాయితీగానే ఆడాను. బీసీసీఐ తొందరపడి నా కాంట్రాక్టును రద్దు చేసింది. బోర్డు చేసే విచారణలో నేను నిందితుడినని తేలితే ఉరి తీయండి' అని షమీ ప్రకటించారు.