విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన మహ్మద్ షమీ

శనివారం, 11 ఫిబ్రవరి 2023 (19:13 IST)
తన అసాధారణ బౌలింగ్ నైపుణ్యంతో రికార్డులు బద్దలు కొట్టడంలో పేరుగాంచిన భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీ, టెస్ట్ క్రికెట్‌లో భారీ బ్యాటింగ్ రికార్డును బ్రేక్ చేశాడు. 
 
నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన భారత మ్యాచ్‌లో, రవీంద్ర జడేజా వికెట్ పతనం తర్వాత షమీ 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు ఈ సందర్భంగా బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. తద్వారా ఆల్‌రౌండర్‌గా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. 
 
కేవలం 47 బంతుల్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో సహా 37 పరుగులతో విజృంభించాడు. భారత తొలి ఇన్నింగ్స్‌లో షమీ సహకారంతో అక్షర్ పటేల్‌తో కలిసి జట్టు 400 పరుగుల భారీ స్కోరును చేరుకుంది. 131వ ఓవర్‌లో, షమీ విపరీతంగా చెలరేగి, వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. 
 
ఇది టెస్టు క్రికెట్‌లో అతని 24వ, 25వ సిక్స్ కావడం విశేషం. ఈ ఫీట్‌తో టెస్టు క్రికెట్‌లో 24 సిక్సర్లు బాదిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే షమీ అగ్రస్థానంలో నిలిచాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు