ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కెప్టెన్ ధోనీ, బౌలర్ అశ్విన్‌ల మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. పుణే సూపర్ జెయింట్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొన్ని ఐపీఎల్ మ్యాచులలో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌కు బౌలింగ్‌కు అవకాశం ఇవ్వట్లేదని వస్తున్న పుకార్లపై, ధోనీ- అశ్విన్ ఇంతవరకు నోరు తెరవక పోయినా.. దీనిపై మాజీ పేసర్ అజిత్ అగార్కర్ స్పందించాడు.
అశ్విన్ పైన ధోనీ నమ్మకం కోల్పోలేదనేందుకు ఇప్పటికే ముగిసిన మ్యాచ్ పరిస్థితులే కారణమన్నాడు. ముంబై వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో పూణే ఆడిన మ్యాచ్‌లో వాంఖేడే పిచ్ సీమర్లకు అనుకూలిస్తుందని, అందుకే ఈ మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. చెన్నైలో ఐపీఎల్ మ్యాచులు ఆడినప్పుడు అక్కడి వికెట్ స్పిన్‌కు సహకరిస్తుందని, కాబట్టి అశ్విన్‌కు ఎక్కువ అవకాశమిచ్చాడని చెప్పాడు.