ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ : సిడ్నీ చేరుకున్న ధోనీ - రోహిత్

బుధవారం, 9 జనవరి 2019 (15:20 IST)
ఆస్ట్రేలియా భారత్ క్రికెట్ జట్ల మధ్య వన్డే సిరీస్ ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఇందుకోసం భారత జట్టులో స్వల్ప మార్పులు చేశారు. ముఖ్యంగా, టెస్ట్ జట్టులోని కొంతమంది ఆటగాళ్లను తొలగించి వారి స్థానంలో పలువురు సీనియర్ క్రికెటర్లకు చోటుకల్పించారు.
 
ఈ నేపథ్యంలో ఈ వన్డే సిరీస్ కోసం మహేంద్ర సింగ్ ధోనీ, వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. తొలి వన్డేకు వేదికైన సిడ్నీ నగరానికి వారు చేరుకున్నారు. వీరివెంట యువ బౌలర్ యజువేంద్ర చాహల్ కూడా ఉన్నారు. రోహిత్, ధోనీతో కలిసి భారత్ నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరామని ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
 
మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే శనివారం ఆరంభంకానుంది. టెస్టు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్పీడ్‌స్టర్ బుమ్రా స్థానంలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. సిరాజ్ కూడా త్వరలోనే జట్టుతో కలవనున్నాడు. మరోవైపు భారత సారథి విరాట్ కోహ్లీ టెస్టు సిరీస్ విజయాన్ని భార్య అనుష్క శర్మతో కలిసి ఆస్వాదిస్తున్నాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు