ధోనీకి ఇవ్వాల్సిన బకాయిలు ఎంత..? 24 గంటల్లో వివరణ ఇవ్వాలన్న సుప్రీం

శుక్రవారం, 3 మే 2019 (13:09 IST)
ఆమ్ర‌పాలీ రియ‌ల్ సంస్థ‌కు 2009 నుంచి 2016 వ‌ర‌కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. ఆ సమయంలో తనకు రావాల్సిన డబ్బు ఇంకా చెల్లించలేదనీ ధోని పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
దీంతో పాటుగా.. రాంచీలోని ఆమ్రాపాలీ ప్రాజెక్టులో ధోనీ బుక్‌ చేసుకున్న పెంట్‌హౌజ్‌ను కూడా తనకు అధికారికంగా అప్పగించలేదని ఆయన ఆరోపించారు. తనకు రావాల్సిన సొమ్ముతో పాటు.. పెంట్‌ హౌజ్ను త‌న‌కు అప్పగించేలా ఆ సంస్థ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ధోనీ సుప్రీంను కోరాడు.
 
ఈ నేపథ్యంలో ధోనీకి ఎంత డబ్బు ఇవ్వాల్సి ఉందో చెప్పాలంటూ ఆమ్ర‌పాలీ రియ‌ల్ ఎస్టేట్ సంస్థకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ధోనీ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ధోనీకి ఇవ్వాల్సిన మొత్తం ఎంతో చెప్పాలని ఆదేశించింది. సంస్థకు ధోనీకి మధ్య జరిగిన అన్ని లావాదేవీలకు సంబంధించి పూర్తి వివరణను 24 గంటల్లో ఇవ్వాలంటూ తేల్చి చెప్పింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు