ముంబైలో వ్యభిచారం కేసులో పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మాజీ ప్రేయసి పట్టుబడింది. కేవలం రూ.50 వేలకు వ్యభిచారం చేసేందుకు సమ్మతించి... చిక్కుల్లో పడింది. పైగా, ఈమె మంచి మోడల్ మాత్రమే కాకుండా, ప్రముఖ నగల దుకాణానికి ప్రచారకర్తంగా కూడా కొనసాగుతోంది.
పట్టుబడిన ఆ మోడల్‌ను అక్కడికి దగ్గర్లోని మహిళా సంక్షేమ శాఖకు పంపించారు. కానీ ఆమె అక్కడి నుంచి తప్పించుకుంది. దీంతో ఆమెను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. అయితే విచారణలో భాగంగా ఆ మోడల్, తాను పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్‌కు లవర్‌నని చెప్పింది. దీంతో ఎవరా పాకిస్థానీ క్రికెటర్ అంటూ పలు వార్తలు ఇప్పుడు హాల్‌చల్ చేస్తున్నాయి.