రవిశాస్త్రి వారసుడు ఎవరు? నువ్వానేనా అంటున్న గంగూలీ - సెహ్వాగ్

బుధవారం, 17 జులై 2019 (20:43 IST)
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో భారత క్రికెట్ జట్టు సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓడి తిరుగుముఖం పట్టింది. న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న లుకలుకలన్నీ బయటపడ్డాయి. ముఖ్యంగా, కెప్టెన్ కోహ్లీ సేన, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రవిశాస్త్రిల మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. 
 
అదేసమయంలో భారత క్రికెట్ జట్టు కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి కాంట్రాక్టు కూడా ఈ ప్రపంచ కప్‌తో ముగిసింది. కానీ, తదుపరి కోచ్‌ను ఎంపిక చేసేంతవరకు అంటే వెస్టిండీస్ పర్యటన ముగిసేంతవరకు ఆయన కాంట్రాక్టును పొడగించారు. 
 
అదేసమయంలో టీమిండియా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా ఫిజియో, అసిస్టెంట్ ఫిజియోలను ఇంటికి సాగనంపిది. ఇపుడుప్రధాన కోచ్ రవిశాస్త్రితోపాటు... బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ కోచ్‌లపై దృష్టిసారించింది. 
 
ఫలితంగా ప్రధాన కోచ్ వేటను మొదలెట్టింది. ఇందుకోసం దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. ఇందుకోసం కొన్ని నిబంధనలు సైతం పెట్టింది. ఇలాంటి నిబంధనల్లో వయసుతో పాటు కొత్త నిబంధనలను కూడా బోర్డు దరఖాస్తులో జత చేసింది.
 
కోచ్ పదవి అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అంతర్జాతీయ అనుభవంతో పాటు వయసు 60 ఏళ్లకు మించరాదని అందులో పేర్కొంది. హెడ్ కోచ్‌‌తో పాటు బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌, స్ట్రెంగ్త్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌లు, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ను తిరిగి నియమించనున్నట్లు బీసీసీఐ అందులో పేర్కొంది.
 
ఇక ఆసక్తి కలిగిన అభ్యర్దులు తమ దరఖాస్తులను జులై 30, సాయంత్రం ఐదు గంటల్లోగా అందజేయాలని బీసీసీఐ తెలియజేసింది. అటు కోచింగ్ బృందంగా వ్యవహరిస్తున్న సభ్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని బీసీసీఐ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రీ ప్లేస్‌ను భర్తీ చేయడానికి హేమాహేమీలు రేస్‌లో ఉన్నారు. 
 
ఇలాంటివారిలో భారత మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే (కర్నాటక), సౌరవ్ గంగూలీ (వెస్ట్ బెంగాల్), వీరేంద్ర సెహ్వాగ్ (ఢిల్లీ), శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్ధనే, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీలతో పాటు.. ట్రేవర్ బేలిస్‌లు పోటీపడుతున్నారు. వీరిలో ప్రధానంగా సౌరవ్ గంగూలీ - వీరేంద్రం సెహ్వాగ్‌ల మధ్య పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు