ఇషాంత్ శర్మ: టెస్టుల్లో కొత్త రికార్డు.. ఎక్కువ సార్లు ఐదు వికెట్లు

ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (12:28 IST)
Ishant sharma
భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ మెరుగైన ప్రదర్శన చేశాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఇషాంత్ శర్మ జోరు కొనసాగుతోంది. ఇషాంత్‌ ఐదు వికెట్లతో విజృంభించడంతో కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. 
 
టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ఇషాంత్‌కిది 11వ సారి కావడం విశేషం. టెస్టుల్లో ఎక్కువ సార్లు ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో మాజీ పేస్‌ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌తో ఇషాంత్‌ సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాడు. 
 
కివీస్‌తో తొలి టెస్టు మూడో రోజు ఆటలో శర్మ ఈ మైలురాయి అందుకున్నాడు. న్యూజిలాండ్‌ గడ్డపై టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇషాంత్‌కిది మూడోసారి. కాగా.. ఓవరాల్‌గా విదేశాల్లో తొమ్మిదోది కావడం విశేషం. ఇప్పటి వరకు టెస్టు కెరీర్‌లో 97 మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్‌ 174 ఇన్నింగ్స్‌ల్లో 297 వికెట్లు పడగొట్టాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు