భారతగణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం శనివారం రాత్రి పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో క్రీడా రంగం నుంచి ఐదుగురిని ఎంపిక చేసింది. వీరిలో భారత జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేషన్‌ను దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ వరించింది.
అలాగే, ఇటీవల క్రికెట్‌కు టాటా చెప్పేసిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు పద్మశ్రీ లభించింది. ఇక ఫుట్‌బాల్ లెజెండ్ ఐఎం విజయన్‌కూ పద్మశ్రీ ప్రకటించారు. పారా ఆర్చర్ హర్విందర్ సింగ్, పారా అథ్లెటిక్ కోచ్ సత్యపాల్ సింగ్‌కు కూడా పద్మశ్రీ అవార్డులు లభించాయి.
హర్యానాకు చెందిన 33 ఏళ్ల హర్విందర్ సింగ్ పారా ఆర్చర్. టోక్యో పారాలింపిక్స్‌లో రికర్వ్ ఓపెన్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలుచుకున్న ఈ స్టార్.. గత యేడాది జరిగిన పారిస్ క్రీడల్లో పసిడి పతకం కొల్లగొట్టి చరిత్ర సృష్టించాడు. ఇక.. పారిస్ పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ఖేల్ రత్న అవార్డీ హైజంపర్ ప్రవీణ్ కుమార్‌ను తీర్చిదిద్దడంలో సత్యం - పాల్ సింగ్ కీలకపాత్ర పోషించాడు.