వున్న నాలుగు ప్రావిన్స్‌లను ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేయాలని అఫ్రిది డిమాండ్ చేశాడు. అంతటితో ఆగకుండా.. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించడం తమ ప్రభుత్వాలకు చేత కాలేదని అఫ్రిది ఘాటుగా ధ్వజమెత్తాడు. కాశ్మీర్ లోయలో ప్రజలు చనిపోవడం కూడా తనకెంతో బాధగా వుందని.. కాశ్మీర్ గురించి పాకిస్థాన్ మరిచిపోవడమే కాదు.. భారత్‌కు కూడా కాశ్మీర్ ఇవ్వొద్దని అఫ్రిది అన్నాడు. కాశ్మీర్ ప్రత్యేక దేశం కావాలని వ్యాఖ్యానించాడు.
కాశ్మీర్ ప్రజలు ప్రశాంతంగా జీవించాలని.. మానవత్వం వెల్లివిరియాలని అఫ్రిది కామెంట్ చేశాడు. కానీ అఫ్రిది వ్యాఖ్యలపై పాక్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇంకా భారతీయులు, క్రికెట్ ఫ్యాన్స్ అఫ్రిది మాటలపై ఎలా సోషల్ మీడియాలో స్పందిస్తారో కూడా వేచి చూడాలి.