కత్రినా అంటే అమితమైన ఇష్టం.. ఛాన్సిస్తేనా.... పాకిస్థాన్ కెప్టెన్

శుక్రవారం, 24 ఆగస్టు 2018 (09:12 IST)
పాకిస్థాన్ క్రికెటర్లకు స్వదేశీ సినీతారల కంటే.. బాలీవుడ్ హీరోయిన్లంటేనే అమితమైన ఇష్టం. గతంలో చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లపై మనసు పారేసుకున్నారు కూడా. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా బాలీవుడ్ సుందరాంగి కత్రినా కైఫ్‌పై మనసు పారేసుకున్నాడు.

 
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను సర్ఫరాజ్ వెల్లడించారు. అంతేకాకుండా, తనకు అవకాశం అంటూ లభిస్తే కత్రినా కైఫ్‌ సరసన నటించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఆమె అంటే అంత ఇష్టమని చెప్పుకొచ్చాడు. 
 
ఇకపోతే, బాలీవుడ్‌లో అవకాశం వస్తే 'దబాంగ్' సినిమాలో సల్మాన్ ఖాన్ చేసినటువంటి పాత్రను పోషించేందుకు ఇష్టపడతానని తెలిపాడు. ప్రస్తుతం సర్ఫరాజ్ హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో జట్టును విజయపథంలో నడిపి, వైట్ వాష్ చేశాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు