భారత అండర్-19, ఎ-టీమ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ సేవలు అందిస్తున్నారు. రాహుల్ శిక్షణలో రాటుదేలిన అండర్ 19 క్రికెట్ జట్టు వరుసగా ప్రపంచ కప్‌లను గెలుచుకుని సరికొత్త రికార్డు సృష్టించిన విషయం తెల్సిందే. దీంతో ద్రోణాచార్య అవార్డు కోసం రాహుల్ పేరును బీసీసీఐ నామినేట్ చేసింది.
ఇది వివాదాస్పదం అవుతోంది. రాహుల్ ఎంపికపై బోర్డులోనే కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ద్రావిడ్ పేరును నామినేట్ చేయడమంటే ఎంతో మంది క్రికెటర్ల ప్రతిభను చిన్ననాడే పసిగట్టి వారిని సానబెట్టిన గురువులకు అన్యాయం చేసినట్టు అవుతుందంటున్నారు. ముఖ్యంగా, అండర్ -19, ఎ జట్టుకు ద్రావిడ్ చేసిన సేవలు వెలకట్టలేనివే అయినా.. కోచ్‌గా అతడి అనుభవం మూడేళ్లేనని ఓ అధికారి గుర్తుచేశారు.