సచిన్ - ధోనీ తర్వాత మూడో క్రికెటర్ కోహ్లీ అవుతాడా?

గురువారం, 26 ఏప్రియల్ 2018 (15:00 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, జార్ఖండ్ డైనమెట్‌ మహేంద్ర సింగ్ ధోనీలు రాజీవ్ ఖేల్‌రత్న పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఈ పురస్కారానికి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సిఫార్సు చేసింది. 2016లో కోహ్లీ పేరును సిఫార్సు చేయగా అపుడు నిరాశే ఎదురైంది.
 
ఈ నేపథ్యంలో ఇపుడు మరోమారు కోహ్లీ పేరును బీసీసీఐ సిఫార్సు చేసింది. ఒకవేళ ఈ ఏడాది కోహ్లీని అదృష్టం వరిస్తే సచిన్, ధోని తర్వాత ఈ అవార్డు అందుకున్న మూడో క్రికెటర్ కోహ్లీయే అవుతాడు. మరోవైపు, జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పేరును ద్రోణాచార్య అవార్డుకు ప్రతిపాదించింది. సునీల్ గవాస్కర్‌ను ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు సిఫారసు చేసింది. పలు కేటగిరీలకుగాను చాలా వరకు నామినేషన్లను పంపినట్టు బీసీసీఐ ధ్రువీకరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు