టీ20 ప్రపంచకప్ తర్వాత హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఆయన స్థానంలో ద్రావిడ్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ద్రావిడ్ స్పందిస్తూ... రవిశాస్త్రి కోచ్‌గా టీమిండియా అద్భుతమైన విజయాలను సాధించిందని కితాబునిచ్చారు. ఆటగాళ్లందరి సహకారంతో విజయాల పరంపరను తాను కూడా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు.
మరోవైపు, టీమిండియాకు కోచ్‌గా ద్రవిడ్ నియామకంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. టీమిండియా హెడ్‌కోచ్‌గా ద్రావిడ్‌ను స్వాగతిస్తున్నామని చెప్పారు. సుదీర్ఘమైన ప్లేయింగ్ కెరియర్ ద్రావిడ్ సొంతమన్నారు. క్రికెట్ చరిత్రలోని దిగ్గజాలలో ద్రావిడ్ ఒకరని కొనియాడారు.