భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా, మంగళవారం రాత్రి రాజ్‌కోట్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారత బౌలర్ వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలంతో 24 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు నేలకూల్చాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో బెన్ డకెట్ 51, లియామ్ లివింగ్ స్టన్ 43, కెప్టెన్ జోస్ బట్లర్ 24 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5, హార్దిక్ పాండ్యా 2, రవి బిష్ణోయ్, అక్షర పటేల్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.