బీసీసీఐ కొత్త కార్యదర్శిగా రోహన్ జైట్లీ! బీసీసీఐ కాదు.. డీడీసీఎఏ ముఖ్యమంటూ కామెంట్స్!

ఠాగూర్

మంగళవారం, 27 ఆగస్టు 2024 (12:21 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొత్త కార్యదర్శిగా రోహన్ జైట్లీ నియమితులయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా కొనసాగుతున్నారు. ఈయన పదవీ కాలం వచ్చే నవంబరుతో ముగియనుంది. ఆ తర్వాత ఆయన ఐసీసీ చైర్మన్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. దీంతో బీసీసీఐ తదుపరి కార్యదర్శిగా రోహాల్ జైట్లీ నియమితులుకానున్నారు. 
 
బీసీసీఐ కార్యదర్శి జై షా ఐసీసీ చైర్మన్ ఎన్నికల బరిలో దిగుతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ క్లే పదవీకాలం నవంబర్‌తో ముగియనుంది. అయితే మరోసారి ఆయన ఎన్నికల బరిలో నిలిచేందుకు నిరాసక్తి వ్యక్తం చేశాడు. దీంతో బీసీసీఐ సెక్రటరీ జై షా నిలుస్తారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.
 
ఒకవేళ ఆయన నిజంగానే బరిలోకి దిగితే తర్వాత బీసీసీఐ కార్యదర్శిగా ఎవరనే విషయంపై చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ఓ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి తనయుడు పేరు తెరపైకి వచ్చింది. అతనే ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడు రోహాన్ జైట్లీ. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి రేసులో ముందున్నట్లు వార్తలు వచ్చాయి. 
 
అయితే, తాజాగా ఆయన ఈ వార్తలను కొట్టిపారేశారు. తాను బీసీసీఐ సెక్రటరీ రేసులో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ప్రస్తుతం తాను ఢిల్లీ లీగ్‌ను ప్రమోట్ చేయడంపైనే దృష్టిసారించినట్లు స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు