భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలు టీ20ల్లో అరుదైన రికార్డును నెలకొల్పారు. స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2025 సీజన్ పోటీల్లో భాగంగా, బుధవారం రాత్రి ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో హైదరాబాద్‌ను ముంబై జట్టు ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. జట్టు విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. మొత్తం 70 పరుగులు చేసిన రోహిత్... ఈ క్రమంలో టీ20ల్లో 12 వేల పరుగుల ఫీట్‌ను పూర్తి చేశాడు. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ తర్వాత ఈ అరుదైన ఫీట్‌ను సాధించిన రెండో భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అలాగే, భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీ20 క్రికెట్‌లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. టీ20ల్లో అత్యంత వేగంగా ఈ మార్కును అందుకున్న భారత బౌలర్‌గా రికార్డు సాధించాడు.
ఈ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 46 బంతుల్లో 70 పరుగులు చేసి టీ20ల్లో 20 వేల పరుగుల మైలురాయిని పూర్తి చేశాడు. విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా టీ20ల్లో 12 వేల పరుగులు పూర్తి చేసిన ఎనిమిదో ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం హిట్ మ్యాన్ 12,056 టీ20 పరుగులు చేశాడు.
ఇక ఇదే మ్యాచ్‌లో భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సన్ రైజర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెస్ వికెట్ తీయడం ద్వారా టీ20 క్రికెట్‌లో 300 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో టీ20 ఫార్మెట్‌లో అత్యంత వేగంగా (237 ఇన్నింగ్స్)ఈ మార్కును అందుకున్న భారత బౌలర్‌గా నిలిచాడు. అలాగే, ఐపీఎల్‌లో ముంబై తరపున అత్యధిక వికెట్లు తీసిన లసిత్ మలింగా రికార్డును సమం చేశాడు.