గాఢ నిద్రలో వున్న భర్త గొంతు పిసికి మర్మాంగాలపై దాడి చేసిన భార్య, ఎందుకంటే?

ఐవీఆర్

బుధవారం, 10 సెప్టెంబరు 2025 (18:28 IST)
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. భర్తను కాదని వేరొకరి మోజులో పడి కొంతమంది వివాహితలు అక్రమ సంబంధాలు సాగించడంతో పాటు తమ ఏకాంత సుఖానికి అడ్డుగా వున్న భర్తను హత్య చేయడం వంటి ఘాతుక చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే కర్నాకట రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో జరిగింది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. విజయపుర జిల్లాలోని అక్కమహాదేవి కాలనీలో బీరప్ప, సునంద దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. బీరప్ప పూజారిగా పని చేస్తూ వున్నాడు. ఐతే పూజారి వద్దకు కొన్ని రోజుల క్రితం సిద్ధప్ప అనే వ్యక్తి వచ్చాడు. బీరప్పతో పూజాది కార్యక్రమాలు చేయించుకున్నాడు కానీ అతడి భార్య సునందపై కన్నేసాడు. ఏదో ఒక వంకతో వారి ఇంటికి తరచూ రావడం ప్రారభించాడు. అలా క్రమంగా సునందతో స్నేహాన్ని పెంచుకున్నాడు. కొద్దిరోజుల్లోనే సునందను లొంగదీసుకుని ఆమెతో వివాహేతర సంబంధాన్ని సాగించాడు.
 
భర్త పనిపై పక్క ఊళ్లకు వెళ్లినప్పుడు ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడిపేవారు. ఐతే ఈమధ్య భర్త బీరప్ప ఇంటికే పరిమితమై ఎక్కడికీ వెళ్లడంలేదు. దాంతో ప్రియుడితో గడిపే అవకాశం లభించకపోవడంతో తమ సుఖానికి అడ్డుగా వున్న భర్తను చంపేయాలని నిర్ణయించుకున్నది సునంద. విషయాన్ని ప్రియుడు సిద్ధప్పకు చెప్పింది. అర్థరాత్రి వేళ ఇంటికి రావాలని కోరింది. ప్రియుడు సిద్ధప్ప రాగానే ప్రణాళిక ప్రారంభించింది. గాఢ నిద్రలో వున్న భర్త బీరప్ప గొంతు నులుముతూ అతడి మర్మాంగాలపై దాడి చేయడం మొదలుపెట్టింది.
 
ప్రియుడు సిద్ధప్ప కూడా ఆమెకి సహకరించాడు. ఐతే బీరప్ప శక్తినంతా కూడదీసుకుని కాళ్ల వద్ద వున్న కూలర్ పైన గట్టిగా తన్ని పెద్ద శబ్దం చేసాడు. ఆ శబ్దానికి ఇల్లు అద్దెకి ఇచ్చిన యజమాని తన భార్యతో సహా వచ్చేసారు. పిల్లల్లో పెద్దవాడు తలుపు గడియ తీయడంతో సునంద ఆమె ప్రియుడు ఇద్దరూ దొరికిపోయారు. తనపై హత్యాయత్నం చేసిన భార్య, ఆమె ప్రియుడిపై బీరప్ప ఫిర్యాదు చేయడంతో ఇద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకి తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు