మెగాస్టార్ చిరంజీవి ని కలిసిన క్షణం ఎంత మెగా క్షణం విజయ్ సేతుపతి, పూరీ

దేవీ

బుధవారం, 10 సెప్టెంబరు 2025 (16:41 IST)
Vijay sethipati team met mana shankar vara parasad team
మెగాస్టార్ చిరంజీవిని బెగ్గర్ చిత్ర టీమ్ కలిసింది. రామోజీ ఫిలిం సిటీలో పక్క పక్కనే షూటింగ్ లు జరుపుకుంటున్న పూరీ జగన్నాథ్, చార్మి చిత్రం బెగ్గర్. ఆ పక్కనే మన శంకర వర ప్రసాద్ టీమ్ ను కలిశారు. ఈ అద్భుతమైన క్షణాలను మెగా క్షణం అంటూ పూరీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విజయ్ సేతుపతి, సంయుక్త,బెగ్గర్ నిర్మాత వున్నారు. నయనతార, చిరంజీవి, బ్రహ్మాజీలు ఈ ఫొటోలు వున్నారు.
 
నిన్నటిలో మన శంకరవరప్రసాద్, నయనతారపై సాంగ్ చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా పూరి, సేతుపతి టీమ్ వారికి కలిశారు. ఇక విజయ్ సేతుపతి, చార్మి, పూరి కాంబినేషన్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఇప్పటికే చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా వచ్చే సంక్రాంతికి ఫిక్స్ చేశారు. ఈ చిత్రం పూర్తి తారాగణంతో హైదరాబాద్ షెడ్యూల్ ముందుకు సాగుతోంది. మరోవైపు పూరీ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదలవుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు