బీసీసీఐ చీఫ్‌గా గంగూలీ.. సెక్రటరీగా అమిత్ షా తనయుడు

సోమవారం, 14 అక్టోబరు 2019 (15:14 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్‌గా సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు. అలాగే, కార్యదర్శిగా అమిత్ షా తనయుడుని ఎన్నుకున్నట్టు సమాచారం. బీసీసీఐ చీఫ్ పదవికి పోటిపడిన బ్రిజేష్ పటేల్ చివరి నిమిషంలో తప్పుకున్నారు. దీంతో బీసీసీఐ చీఫ్‌గా సౌరవ్ గంగూలీ ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. 
 
బీసీసీఐ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆఖరు తేది సోమవారం కాగా, పోటీ అన్నదే లేకుండా కార్యవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా ఇప్పటికే చర్చలు సాగాయి. దీంతో గంగూలీ బీసీసీఐ కొత్త బాస్‌గా ఎన్నికవడం లాంఛనమే. 
 
అదేవిధంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కమారుడైన జై షా కార్యదర్శిగా, బోర్డు మాజీ చీఫ్‌, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడైన అరుణ్‌ ధుమాల్‌ కోశాధికారిగా పగ్గాలు చేపట్టనున్నారు. 47 ఏళ్ల గంగూలీ ప్రస్తుతం బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షునిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు