భారత్‌లో పర్యటన చేపట్టిన ఇంగ్లండ్‌కు భారత్ చేతిలో ఘోర పరాభవం తప్పదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. టీమిండియా ప్రస్తుత ఫామ్‌పై గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. భారత ఆటగాళ్ల ఫామ్ చూస్తుంటే.. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్‌ను క్లీన్ స్వీప్ చేస్తారని గంగూలీ వ్యాఖ్యానించాడు. బంగ్లా పర్యటనలో టెస్టు క్రికెట్‌లో విఫలమై.. ప్రస్తుతం టీమిండియాతో బరిలోకి దిగనున్న ఇంగ్లండ్ తీవ్రంగా శ్రమించే అవకాశం ఉందని గంగూలీ చెప్పాడు.
కానీ న్యూజిలాండ్ మాదిరే ఇంగ్లండ్‌ను కూడా వైట్ వాష్ చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. మరోవైపు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌తో చివరి టెస్టులో ఓటమిపాలైన విషయాన్ని మనసులోంచి తీసివేయాలని చెప్పాడు. భారత జట్టులో అశ్విన్, జడేజాలాంటి స్పిన్నర్లు ఉన్నారన్న విషయం గురించి మరిచిపోవాలని.. సహజసిద్ధంగా ఆడితే ఇంగ్లండ్‌కు విజయం ఖాయమన్నాడు. సొంతగడ్డపై భారత్ మెరుగ్గా ఆడే అవకాశం ఉన్నందున ఒత్తిడికి లోనుకాకూడదని వాన్ ఆటగాళ్లకు సూచించాడు.