జేమ్స్‌ ఆండర్సన్ అరుదైన ఘనత...6/40తో అదుర్స్

శనివారం, 23 జనవరి 2021 (16:58 IST)
James Anderson
ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జేమ్స్‌ ఆండర్సన్ ‌(38) అరుదైన ఘనత సాధించాడు. గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆండర్సన్‌(6/40) ఆరు వికెట్లతో చెలరేగాడు.

టెస్టుల్లో ఆండర్సన్‌ ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది 30వ సారి. ఆసీస్‌ మాజీ పేసర్‌ గ్లెన్ మెక్‌గ్రాత్ ‌(29 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన) రికార్డును ఆండర్సన్‌ అధిగమించాడు.
 
టెస్టు క్రికెట్‌లో ఈ జాబితాలో శ్రీలంక స్పిన్‌ లెజెండ్‌ ముత్తయ్య మురళీధరన్‌ అత్యధికంగా 67సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా.. ఆస్ట్రేలియా మాజీ లెగ్‌ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌(37), న్యూజిలాండ్‌ ఫాస్ట్‌బౌలర్‌ రిచర్డ్‌ హడ్లీ (36), భారత మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే (35), లంక మాజీ స్పిన్నర్‌ రంగన హెరాత్‌ (34) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు