పౌరసత్వం సవరణ చట్టం చేస్తే కాళ్లు విరగ్గొడతా : బీజేపీ ఎంపీ హెచ్చరిక

ఠాగూర్

బుధవారం, 29 అక్టోబరు 2025 (13:29 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ హకీమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో పౌరసత్వం సవరణ చట్టం చేస్తే మాత్రం కాళ్ళు విరగ్గొడతానని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) పేరుతో భారతీయ జనతా పార్టీ, కేంద్ర ఎన్నికల సంఘం కలిసి పౌరసత్వ సవరణ చట్టానికి మార్గం సగుమమం చేస్తే ప్రతిఘటన తప్పదని ఆయన అన్నారు. 
 
దేశ వ్యాప్తంగా ఓటర్లజాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఈసీ సిద్ధమైది. పశ్చిమ బెంగాల్‌‌లో కూడా దీన్ని నిర్వహించాలనుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి ఫిర్హాద్‌ హకీమ్‌ భాజపా, ఈసీ లక్ష్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హకీమ్ వ్యాఖ్యలపై భాజపా అభ్యంతరం వ్యక్తం చేసింది. 
 
ఈసీ నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై వివరించేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అందులో పాల్గొన్న హకీమ్‌.. అనంతరం విలేకరులతో మాట్లాడారు. భాజపా, ఈసీలు కలిసి ఎస్‌ఐఆర్‌తో పౌరసత్వ సవరణ చట్టం అమలుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు. 
 
ఈ క్రమంలో వారు అలా చేస్తే.. వారి కాళ్లు విరగ్గొడతానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజమైన ఓటర్లను జాబితా నుంచి మినహాయించేందుకు ఇదో ప్రయత్నమని అభివర్ణించారు. పశ్చిమబెంగాల్‌ నుంచి ఒక్క నిజమైన ఓటరు పేరు కూడా తొలగించేందుకు తాము అనుమతించమన్నారు. 
 
ఇక, హకీమ్‌ వ్యాఖ్యలపై ఈసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే, భాజపా వీటిని తీవ్రంగా తప్పుబట్టింది. సీఎం మమతా బెనర్జీ సన్నిహితుడైన హకీమ్ ఎన్నికల కమిషన్‌ కాళ్లు విరగ్గొడతాననడాన్ని భాజపా జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్‌ భండారీ ఖండించారు. రాజ్యాంగ సంస్థపై టీఎంసీ బహిరంగ బెదిరింపులకు పాల్పడిందన్నారు. హింసను ప్రేరేపించడంతో పాటు అక్రమ చొరబాటుదారులను రక్షించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు