భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సొంతగడ్డపై జరిగిన క్రికెట్ సిరీస్ పలు వివాదాలకు దారి తీసింది. ఇరు జట్ల క్రికెటర్లు మైదానంలో నువ్వానేనా అన్నట్లు.. బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాదు.. మాటల తూటాలు కూడా మైదానంలోనే పేల్చుకున్నారు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు సిరీస్ హోరాహోరీగా ముగిసింది. బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో ఇరు జట్ల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది.
బెంగళూరు టెస్టులో ఆసీస్ ఆటగాడు స్మిత్ ఔటైన సమయంలో సమీక్షలో సాయం కోసం డ్రెస్సింగ్ రూమ్‌ను ఆశ్రయించాడు. అప్పటికే అనేక సార్లు డ్రస్సింగ్ రూమ్ సాయం కోసం ఆసీస్ క్రికెటర్లు ఆశ్రయిస్తున్నట్లు పసిగట్టిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. ఆపై స్మిత్ కూడా తాను చేసిన తప్పును అంగీకరించాడు. ఈ వివాదం అంతటితో ముగిసినా.. చివరి టెస్టులో కూడా వేడ్-జడేజా మధ్య మాటల యుద్ధం జరిగింది.
ఈ నేపథ్యంలో సిరీస్‌లో చివరి టెస్టు ముగిసిన అనంతరం ఆసీస్ సారథి స్మిత్ మాట్లాడుతూ... సిరీస్ మధ్యలో తీవ్ర ఒత్తిడి కారణంగా కొన్నిసార్లు అనుకోకుండా తన నోట మాటలు పేలాయని.. సారీ అని చెప్పాడు. ఆటగాడిగా, సారథిగా... మ్యాచ్, సిరీస్‌లో విజయం సాధించాలనే కోరుకుంటాను. ఆ క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవ్వడంతో నా నుంచి కొన్ని మాటలు అనుకోకుండా దొర్లాయి.