అమెరికాలో భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్‌కు అవమానం జరిగింది. స్టేడియంలోకి వెళ్ళనివ్వకుండా భద్రతా సిబ్బంది ఆయనను అరగంట పాటు అలానే నిల్చోబెట్టారు. ఈ ఘటనపై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో గల స్టేడియంలో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య రెండో ట్వంటీ-20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కామెంటేటర్ బృందంలో సునీల్ గవాస్కర్‌కు చోటుంది.