సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు జోహెన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో గెలుపొందినప్పటికీ.. టెస్ట్ సిరీస్‌ను మాత్రం 2-1 తేడాతో కోల్పోయింది. ఈ సరీస్ తర్వాత వన్డే, టీ20 సిరీస్‌లను దక్కించుకోవాలని భారత జట్టు గట్టి పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో వన్డే, టీ20 సిరీస్‌కు సరైన జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఎంపిక చేసింది.
టీ20లు ఫిబ్రవరి 18, 21, 24 తేదీల్లో జరగనుండగా, వన్డే సిరీస్ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే వన్డే జట్టు సౌతాఫ్రికాలో ప్రాక్టీస్ ప్రారంభించగా, టీ20 సిరీస్‌కు సురేష్ రైనా భారత జట్టులోకి మళ్లీ ఎంపికయ్యాడు.
ట్వంటీ-20 జట్టు వివరాలను పరిశీలిస్తే, కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, మహేంద్ర సింగ్ ధోని, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, మనీష్ పాండే, అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ ప్రీత్ బుమ్రా, జయదేవ్ ఉనద్కత్, శార్దుల్ థాకూర్‌లతో బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో బలమైన జట్టును ఎంపిక చేసింది.