ప్రత్యర్థులుగా మారిన ఆస్ట్రేలియా బెస్ట్ ఓపెనింగ్ జోడీ!

శుక్రవారం, 12 నవంబరు 2021 (11:36 IST)
గత 2000 సంవత్సరంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు అత్యుత్తమ ఓపెనింగ్ జోడీగా పేరుగడించిన వారిలో మ్యాథ్యూ హెడన్ - జస్టిన్ లాంగర్ జంట ఒకటి. వీరిద్దరి సగటు 57 శాతంగా ఉంది. అయితే, ఇపుడు వీరిద్దరూ ప్రత్యర్థులుగా మారిపోయారు. దీనికి కారణం లేకపోలేదు. 
 
పాకిస్థాన్ జట్టుకు బ్యాటింగ్ సలహాదారుగా హెడెన్ కొనసాగుతుంటే, జస్టిన్ లాంగర్ ఆస్ట్రేలియా జట్టుకు తగిన సూచనలు సలహాలు ఇస్తున్నారు. దీంతో ఈ రెండు జట్లూ క్రికెట్ మైదానంలో తలపడినపుడు వీరిద్దరూ బద్ధ శత్రువులుగా మారిపోతున్నారు. 
 
గురువారం ఐసీసీ పురుషులు ట్వంటీ20 ప్రపంచ కప్ రెండో సెమీ ఫైనల్ పోటీలో ఈ రెండు జట్లూ తలపడ్డాయి. కానీ ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఓడిపోయింది. ఆసీస్ ఆటగాడు మ్యాథ్యూ వేడ్ బ్యాట్‌తో వీరవిహారం చేయడంతో పాక్ ఉంచిన భారీ లక్ష్యం చిన్నదైపోయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు