Balineni Srinivasa Reddy, Samudra, Sivika and others
సముద్ర, శివిక, కుసుమ, సుప్రియ, నవీన్ మట్టా, రోహిల్, ఆదిల్, రూపేష్, కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం అన్నపూర్ణ తల్లి బువమ్మ. గోరి బ్రదర్స్ మీడియా, బ్లాక్ అండ్ వైట్ మూవీ మార్క్ పతాకాలపై సిరాజ్ ఖాదరన్ గోరి నిర్మిస్తున్నరు. సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, రాధికాపతి దాస్ ప్రభు, సాయి విజయేందర్ సింగ్ తదితరులు హాజరయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి టీమ్ అందరికీ షీల్డ్‌లు అందజేశారు.