టీమిండియా మాజీ క్రికెటర్, కేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్.. సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ చరిత్రలో బౌలర్‌గా పేరు తెచ్చుకుని స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకుని నానా తంటాలు పడి.. ఆపై పెళ్ళి చేసుకుని ఓ ఇంటివాడైన శ్రీశాంత్‌కు దశ తిరిగింది. ఇటీవలే తండ్రి అయిన శ్రీశాంత్.. మలయాళ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఆ సినిమా పేరు టీమ్5.
ఈ ట్రైలర్‌కు నెగటివ్ టాక్ వస్తోంది. ట్రైలర్‌ను చూసిన చాలామంది పెదవి విరుస్తున్నారు. దీనికి కారణం ట్రైలర్‌లో హీరో కంటే ఇతర పాత్రధారులపైనే పూర్తి దృష్టి పెట్టడమే. కథాపరంగా అలా జరిగి ఉండొచ్చు కానీ ఓ క్రికెటర్ హీరోగా మారి చేస్తున్న మొదటి సినిమాలో శ్రీశాంత్‌ను ఫోకస్ చేయకపోవడం ఏమిటని సినీ జనం ప్రశ్నిస్తున్నారు. అందువల్ల హీరోని హైలైట్ చేయడానికి దర్శకుడు ప్రయత్నించి వుంటే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.