రంజీ ట్రోఫీ టైటిల్ నెగ్గిన ముంబై.. సచిన్ అభినందనలు

సెల్వి

గురువారం, 14 మార్చి 2024 (19:01 IST)
Ranji Trophy
ఎనిమిదేళ్ల తర్వాత 42వ రంజీ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకున్న ముంబైకి లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభినందనలు తెలిపాడు. ఎనిమిదేళ్ల తర్వాత రంజీ టైటిల్‌ను ముంబై గెలుచుకుంది. గురువారం వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 5వ రోజు విదర్భను 169 పరుగుల తేడాతో ఓడించి రికార్డు-42వ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో ముగిసింది.
 
42వ రంజీ ట్రోఫీని గెలుచుకున్నందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు అభినందనలు అంటూ సచిన్ టెండూల్కర్ తెలిపారు. సచిన్‌తో పాటు జాఫర్, ఉనాద్కత్‌లు కూడా ముంబై రంజీ టీమ్‌ను అభినందించారు. వాంఖ‌డే స్టేడియంలో విద‌ర్భ‌తో జ‌రిగిన ఫైన‌ల్‌లో 169 ప‌రుగుల‌ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. 
 
తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 224 ప‌రుగులు చేయ‌గా, విద‌ర్భ 105 ప‌రుగుల‌కే చాప‌చుట్టేసింది. ఆ త‌ర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 418 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. మొద‌టి ఇన్నింగ్స్‌లో 119 ప‌రుగుల ఆధిక్యాన్ని క‌లుపుకొని విద‌ర్భ ముందు 537 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఉంచింది. 
 
ఈ భారీ టార్గెట్‌ను ఛేదించే క్ర‌మంలో విద‌ర్భ రెండో ఇన్నింగ్స్‌లో 368 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. దీంతో ముంబై 169 ప‌రుగుల తేడాతో బంప‌ర్ విక్ట‌రీ నమోదు చేసింది. అలాగే ముంబై త‌న ఖాతాలో 42వ రంజీ ట్రోఫీ టైటిల్‌ను వేసుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు