మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్.. పాకిస్థాన్ జట్టుకు అదనపు ఫీల్డర్‌గా వ్యవహరించాడంటే నమ్ముతారా.. నమ్మి తీరాల్సిందే. ఈ విషయాన్ని 48 ఏళ్ళ సచిన్ తన జీవిత చరిత్ర ప్లేయింగ్ ఇట్ మై వే పుస్తకంలో ప్రస్తావించారు.
ఆ సంఘటనను సచిన్ వివరిస్తూ లంచ్ తర్వాత పాక్ ఆటగాళ్లు మియాందాద్ , అబ్దుల్ ఖాదిర్‌లు ఆలస్యం చేయటంతో పాక్ కెప్టెన్ సచిన్‌ను కొద్దిసేపు ఫీల్డింగ్ చేయాలసిందిగా కోరాడు. దీంతో ఆశ్చర్య పోయిన సచిన్ ఫీల్డింగ్‌కు దిగాడు. ఒక దశలో కపిల్ దేవ్ క్యాచ్‌ను అందుకున్నంత పని చేశాడు. లాంగ్ ఆన్‌లో ఉన్న సచిన్ చాల దూరం పెరిగేట్టు కుంటూ వచ్చి క్యాచ్ మిస్ చేసాడు.