మొతేరా స్టేడియంలో ఆదివారం రాత్రి భారత్ - ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కంగారులు ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది మరోమారు విశ్వవిజేతగా నిలిచారు. ఆస్ట్రేలియాను మాత్రం ఓపెనర్ ట్రావిడ్ హెడ్ గెలిపించాడు. భారత బౌలర్ల పాలిట సింహస్వప్నంలా మారి సెంచరీ కొట్టి నాటౌట్‌గా నిలిచాడు. కప్ గెలిచిన తర్వాత హెడ్ మీడియాతో మాట్లాడుతూ, మ్యాచ్‌ను మలుపుతిప్పింది భారత కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ అని అన్నాడు. రోహిత్ క్యాచ్‌ను పడతానని అస్సలు అనుకోలేదన్నాడు.
"మిచెల్ మార్ష్ పెవిలియన్ చేరాక వికెట్ కఠినంగా ఉందని అర్థమైందన్నారు. టాస్ గెలిచిన తర్వాత ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం. మ్యాచ్ గడిచే కొ1ద్దీ వికెట్ మెరుగైంది. పిచ్ మధ్యలో కొద్దిగా స్పిన్‌కు అనుకూలించింది. సెంచరీ చేయడం, రోహిత్ శర్మ క్యాచ్ పట్టడం నేను అస్సలు ఊహించలేదు. బహుశా ప్రపంచంలోకెల్లా అత్యంత దురదృష్టవంతుడు రోహిత్ శర్మయేనేమో అన్నాడు. అలాగే, ఫైనల్స్‌లో సెంచరీ చేసిన తమ దేశ ఆటగాళ్లు రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ తర్వాత స్థానంలో తాను ఉన్నారు. మొత్తానికి ఈ టోర్నీ తనకు ఎంతో ఆనందాన్ని మిగిల్చింది అని హెడ్ చెప్పుకొచ్చాడు.