రాహుల్ ద్రావిడ్‌ను ప్రధానమంత్రిని చేయాలంటున్న నెటిజన్లు.. ఎందుకు?

మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (14:11 IST)
భారత అండర్-19 క్రికెట్ జట్టు కోచ్, క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్‌ను దేశ ప్రధానమంత్రిని చేయాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వారు అలా డిమాండ్ చేయడం వెనుక ఓ బలమైన కారణం లేకపోలేదు. 
 
రాహుల్ ద్రావిడ్ ప్రధాన కోచ్‌గా ఉన్న అండర్ 19 జట్టు ఇటీవల ప్రపంచ విజేతగా నిలిచిన విషయం తెల్సిందే. దీంతో జట్టుతో పాటు.. కోచ్, ఇతర సహాయక సిబ్బందికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) భారీ మొత్తంలో నజరానా ప్రకటించింది. ఇందులో కోచ్‌కు రూ.50 లక్షలు, టీమ్ సభ్యులకు రూ.30 లక్షలు, కోచింగ్ స్టాఫ్‌కు రూ.20 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది.
 
దీనిపై ద్రావిడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాడు. అందరూ సమానంగా కష్టపడితేనే వరల్డ్‌కప్ సాధ్యమైందని, అలాంటిది ఒక్కొక్కరికీ ఒక్కో నజరానా ఎందుకని బోర్డును బహిరంగంగా ప్రశ్నిస్తూ, అందరికీ సమంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ డిమాండ్‌కు బీసీసీఐ తల వంచింది. కోచ్ ద్రావిడ్‌కు ఇచ్చిన రూ.50 లక్షల ప్రైజ్‌మనీలో రూ.25 లక్షలు కోతవిధించి... మిగిలిన సభ్యులకు కూడా రూ.25 లక్షల చొప్పున నజరానా ఇచ్చింది. 
 
ఇది చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. అసలు ఇలాంటి వాడే కదా మనకు కావాల్సింది అంటూ ద్రవిడ్‌పై ప్రశంసలు కురిపించారు. పక్కవాళ్ల బాగోగుల గురించి ఆలోచించే ద్రవిడ్.. నిజమైన లెజెండ్ అని కొనియాడారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ విశాల్ మొదట ప్ర‌ధాన‌మంత్రిని చేయాల‌ని ప్ర‌తిపాదించ‌గా.. మిగిలిన నెటిజన్లంతా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిపోయింది. 

 

Can we please just elect Dravid to the post of PM?

I know it sounds silly, but this is the kind of person India needs. Someone who cares for others. Everything else can be learnt, but decency & kindness come from within.
https://t.co/UjshjFTJFR

— VISHAL DADLANI (@VishalDadlani) February 25, 2018

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు