ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ సేనను కలిసేందుకు గతంలో మాల్యా ప్రయత్నించగా, భారత ప్రభుత్వం అందుకు అంగీకరించలేదని సమాచారం. దీంతో మ్యాచ్ చూసుకుని వెళ్లిపోయాడు. తాజాగా మరోమారు మ్యాచ్‌కు వచ్చి కలకలం రేపాడు. ఇంగ్లండ్ నుంచే తన వ్యాపార కార్యకలాపాలను చక్కబెట్టుకుంటున్న మాల్యాను దేశానికి రప్పించేందుకు భారత్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.