భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎక్కడ కనిపించినా ఆయనతో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు హగ్ చేసుకునేందుకు పోటీపడుతుంటారు. ఇటీవల రంజీ ట్రోఫీలో ఆడగా ఆ మ్యాచ్‌ను సైతం వీక్షించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. కటక్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌కు ముందు రోజు విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్న సమయంలోనూ ఫ్యాన్స్ స్టేడియానికి పోటెత్తారు. అలాంటిది విరాట్ కోహ్లీ ఇక పబ్లిక్ పేస్‌లలో కనిపిస్తే ఆయన అభిమానులు ఊరుకుంటారా? అయితే, తాజాగా ఓ కోహ్లీ స్వయంగా ఓ మహిళ వద్దకు వెళ్లి హగ్ ఇవ్వడం ఇపుడు హాట్ టాపిగా మారింది.
ఇంగ్లండ్‌తో మూడో వన్డే కోసం భారత క్రికెట్ జట్టు అహ్మదాబాద్ బయలుదేరడానికి భువనేశ్వర్ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టులో చెకింగ్ ఏరియాలో ముందు కొంతమంది ఫ్యాన్స్ క్రికెటర్లను చూడటానికి నిలిచివున్నారు. కోహ్లీ అటువైపు వస్తూ ఓ గుంపులోని ఓ మహిళని చూశాడు. నవ్వుతూ ఆమె వద్దకు వెళ్లి హగ్ ఇచ్చి వెళ్లిపోయాడు.
అక్కడ ఉన్న మిగిలిన వారు కోహ్లీ కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో భద్రతా సిబ్బంది కల్పించుకుని ఫ్యాన్స్‌ను అడ్డుకుని, కోహ్లీని అక్కడ నుంచి పంపించి వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విరాట్ నుంచి హగ్ అందుకున్న ఆ లక్కీ లేడీ ఎవరు, ఆమెను కోహ్లీ ఎందుకు హగ్ చేసుకున్నాడు అని ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. అయితే, సదరు మహిళ కోహ్లీ దగ్గరి బంధువు అని తెలుస్తుంది. అందుకే ఆమె వద్దకు వెళ్లి హగ్ ఇచ్చాడన్నది సమాచారం.