సెహ్వాగ్ కుమారుడా మజాకా.. ఆర్యవీర్ అదుర్స్.. 200 పరుగులతో నాటౌట్

సెల్వి

శుక్రవారం, 22 నవంబరు 2024 (10:04 IST)
Virender Sehwag
భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ అదరగొట్టాడు. కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ తరపున బరిలో దిగిన ఆర్యవీర్ మేఘాలయతో మ్యాచ్‌లో మొత్తం 229 బంతులు ఎదుర్కొని 200 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 
 
ఇందులో రెండు సిక్స్‌లతో పాటు ఏకంగా 34 బౌండరీలు ఉన్నాయి. ఫోర్లు, సిక్సుల ద్వారానే ఆర్యవీర్ 148 పరుగులు చేయడం విశేషం. డబుల్ సెంచరీతో తన ఆగమనాన్ని సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ ఘనంగా చాటుకున్నాడు.
 
ఆర్యవీర్ బాదుడు చూసి తండ్రికి తగ్గ తనయుడు అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆర్య ఇదే ఆట తీరును కొనసాగిస్తే మరి కొన్ని సంవత్సరాల్లో టీమిండియాలోకి అడుగుపెట్టడం ఖాయమని టాక్ వస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు