వ్యాపార భాగస్వాముల చేతిలో మోసపోయిన సెహ్వాగ్ భార్య

ఆదివారం, 14 జులై 2019 (14:29 IST)
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సతీమణి ఆర్తి తన వ్యాపార భాగస్వాముల చేతిలో మోసపోయారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ సంతకాలు ఫోర్జరీ చేసి భాగస్వాములు మోసానికి పాల్పడ్డారంటూ ఆర్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
తన భర్త సెహ్వాగ్‌ పేరును ఉపయోగించుకోవడమేకాక, సంతకాలు కూడా ఫోర్జరీ చేసి బ్యాంకుల నుంచి తమకు తెలియకుండా 4.5 కోట్ల రూపాయలు రుణంగా తీసుకున్నారని ఆరోపించారు. 
 
ఈ సందర్భంగా బ్యాంకుకు రెండు పోస్టు డేటెడ్‌ చెక్కులు కూడా ఇచ్చారన్నారు. తీసుకున్న రుణం బకాయిలు సక్రమంగా తీర్చకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. భాగస్వాముల మోసంపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో కోరారు. అయితే ఈ వివాదంలోని పూర్తి వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు