ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ పోటీల్లో ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లు ముగియగా, సెమీస్ రేసులో నాలుగు ప్రధాన జట్లు నిలిచాయి. వీటిలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి.
అయితే, తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ మంగళవారం భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనుంది. మాంచెష్టర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత అంటే గురువారం బర్మింగ్‌హామ్ వేదికగా ఆస్ట్రేలియా - ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
అయితే, వచ్చే ఆదివారం లార్డ్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో తలపడే జట్లపై ఇంగ్లండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ జోస్యం చెప్పాడు. మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను భారత్ చిత్తు చేస్తుందని, రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోతుందని చెప్పారు. సో.. ఫైనల్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య అంతిమ పోరు జరుగుతుందనీ, ఇందులో భారత్‌ను ఓడిస్తే ఇంగ్లండ్ విశ్వవిజేతగా అవతరిస్తుందని చెప్పుకొచ్చాడు