కానీ, గత మ్యాచ్‌లో విండీస్ దిమ్మదిరిగే షాక్ ఇవ్వడంతో సీన్ రివర్సైంది. ఇప్పుడు ఆఖరి వన్డేలో నెగ్గితేనే కోహ్లీసేన సిరీస్ దక్కించుకునే పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ కరీబియన్లు సిరీస్ సమం చేస్తే మాత్రం భారత్‌కు అవమానమే. అందుకే ఇపుడు భారత్ ముందు ఓ సవాల్ ఉంది.
అయితే, సిరీస్ నెగ్గాలంటే బ్యాట్స్‌మెన్ అంతా సత్తా చాటాల్సిందే. గత మ్యాచ్‌లో అనూహ్య విజయం విండీస్ శిబిరంలో ఆత్మవిశ్వాసం నింపింది. సిరీస్ సమం చేసే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని ఆ జట్టు భావిస్తోంది. ఓడినా తమకు పోయేదేమీ లేదు గనుక కరీబియన్లు స్వేచ్ఛగా ఆడి మరో సంచలన విజయాన్ని నమోదు చేసే అవకాశం లేకపోలేదు.
జట్లు (అంచనా)
భారత్: అజింక్యా రహానె, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), దినేష్ కార్తీక్, ధోనీ, కేదార్/రిషభ్, హార్దిక్ పాండ్యా, జడేజా/అశ్విన్, కుల్దీప్, ఉమేష్, షమి.
వెస్టిండీస్: లూయిస్, కైల్ హోప్, షై హోప్ (కీపర్), ఛేజ్, మహమ్మద్, హోల్డర్ (కెప్టెన్), పావెల్, నర్స్, బిషూ, జోసెఫ్, విలియమ్స్.